తండ్రి, కొడుకుల బంధానికి ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. ఏ తండ్రి అయినా త‌న కొడుకును త‌న వార‌సుడిగా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌నుకుంటాడు. త‌న ఆశ‌యాల‌ను త‌న కొడుకు ద్వారా సాధించాల‌ని, త‌న కొడుకు ప్ర‌ముఖ‌మైన స్థానంలో చూడాల‌ని అనుకుంటాడు. అలాంటి అనుబంధానికి ఓ రోజుంది. అదే ఫాద‌ర్ డే. రేపే ఆ రోజు. ఇక అలాంటి ఫాద‌ర్ల‌కు త‌గ్గ కొడుకులు సినీ ఇండ‌స్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సూప‌ర్ స్టార్ మహేష్ బాబు , కృష్ణ కూడా ఉన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి తండ్రికి తగ్గ కొడుకుగా పేరు గడించారు మ‌హేశ్‌బాబు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను దక్కించుకున్నరు మహేష్ బాబు.



బాల నటుడిగా ఇండ‌స్ట్రీలోకి ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. ఇక ఈ పండుగాడు తన ఫాద‌ర్ కృష్ణతో కలిసి 10 సినిమాల్లో కలిసి చేశారు. ఆ మూవీల్లో బాలనటుడిగా 7 సినిమాల్లో కలిసి నటిస్తే హీరో అయ్యాక తండ్రితో క‌లిసి మూడు మూవీల్లో చేశారు. ఇంతకీ ఏయే సినిమాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారో ఒక‌సారి చూద్దాం.


 మహేష్ బాబు బాలనటుడిగా డైరెక్ట‌ర్ దాసరి నారాయణ రావు డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన నీడ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఆ త‌ర్వాత‌  తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో క‌లిసి మహేష్ బాబు 10 మూవీల్లో చేశారు. బాల నటుడిగా మ‌హేశ్‌బాబు తండ్రితో క‌లిసి ఏడు సినిమాల్లో నటిస్తే.. హీరో అయ్యాక మాత్రం 3 మూవీల్లో చేశారు.  


సూప‌ర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి తన తండ్రితో క‌లిసి కోడి రామకృష్ణ డైరెక్ష‌న్‌లో చేసిన పోరాటంలో న‌టించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంప‌ర్ హిట్‌గా నిలిచింది.  ఆ త‌ర్వాత పోరాటం మూవీలో కలిసి తండ్రితో మంచి హిట్ కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: