స్నేహ ఉల్లాల్ నటించిన మొదటి సినిమాతోనే.. తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె.. అయితే ఈమె అడపదడప సినిమాలు చేసి, ఆ తర్వాత సినిమాల నుంచి దూరంగా తప్పుకోవడానికి గల కారణాలు ఏమిటి అనేది, తెలుసుకుందాం.

స్నేహ ఉల్లాల్ ముందుగా హిందీలో  లక్కీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత "ఉల్లాసంగా ఉత్సాహంగా" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈమె సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. ఐశ్వర్య రాయ్  పోలికతో ఉందని కూడా మంచి మార్కులు పడ్డాయి ఈమెకు. ఇక దీంతో ఈమె దశ తిరిగిందని అందరూ అనుకున్నారు.

ఇక అంతే కాకుండా స్టార్ హీరో అయినటువంటి బాలకృష్ణతో కూడా నటించిన ఈమెకు ఆశించిన ఫలితం రాలేదు. ఇక చివరిసారిగా ఈమె 2014లో "అంతా నీ మాయలోనే" అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది  దానికి గల కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి ఆమెను తీవ్ర అనారోగ్య సమస్యను గురు చేసిందట.

ఆ సమస్య ఏమిటంటే , రక్తానికి సంబంధించినది "ఆటో ఇమ్యూన్ డిజార్డర్"అనే వ్యాధి ద్వారా ఆమె చాలా బాధ పడుతోందని ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక అంతే కాకుండా రోగనిరోధకశక్తి సరిగ్గా పనిచేయకపోవడంతో, ఆమె  సినిమాలలో నటించలేదు. ఇక అంతే కాకుండా కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడ లేకుండా ఉండే దానిని అని స్వయంగా ఆమె తెలిపింది.

ఇక అంతే కాకుండా తను డాన్స్ చేయలేక నీరసంతో పడిపోయింది అట.  అందుకోసమే ఒక సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్న కూడా.. దానిని తిరిగి ఇచ్చేశానని తెలిపింది. అందుకోసమే ఈ వ్యాధి బారి నుండి బయటపడడానికి చికిత్స తీసుకున్నాను అని తెలిపింది. ఇక ఈ చికిత్స అనంతరం ఈమె ఇప్పుడు బాగున్నాను అని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: