మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి తీస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే దీని తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారని, మంచి మెసేజ్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శంకర్ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ఈ సినిమాలోని ఒక కీలకమైన స్పెషల్ క్యారెక్టర్ లో లోకనాయకుడు కమల్ హాసన్ కనిపించనున్నారట. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉండే ఆ పాత్రకు కమల్ అయితేనే కరెక్ట్ అని భావించిన శంకర్, ఇటీవల ఆయనని కలిసి కథ వినిపించి నటించానికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు టాక్. కాగా ఈ సినిమాకి సంబంధించి పూర్తి నటీనటవర్గం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ఒకే తెరపై చరణ్, కమల్ ల ద్వయాన్ని చూడవచ్చు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: