తమిళంలో 'అసురన్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా ధనుష్ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమాను చూసిన నిర్మాత సురేష్ బాబు తెలుగు రీమేక్ రైట్స్ ను పొందాడు. ఎవరితోనే ఎందుకు తీయడం అని వెంకటేష్ తోనే తీయడానికి నిర్ణయించుకున్నాడు. అలా తెలుగులో 'నారప్ప' గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ అందుకుని జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో వెంకటేష్ ఈ చిత్రంలో కూడా ఆ మ్యాజిక్ ను కనబరిచి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రియమణి కూడా ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో సీనియారిటీని చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో ప్రియమణి పాత్ర 'సుందరమ్మ' గా ఈమె నటన నిజంగా ప్రశంసనీయం అంటూ అందరూ ఎంతగానో కొనియాడుతున్నారు. ఇంతకు ముందు అనుకున్న విధంగానే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ప్రియమణి తన దూకుడు చూపిస్తున్నారు. సినిమా రిలీజయ్యాక ప్రియమణి నటనను చూసిన కొందరు దర్శకులు పర్సనల్ గా ప్రియమణికి ఫోన్ చేసి మరీ ఆఫర్ లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమె నాలుగైదు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒక సినిమాలో హీరోయిన్ కి అక్కగా నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు నారప్ప ద్వారా ఈమెకు మళ్ళీ టాలీవుడ్ లో స్థిరపడడానికి ఒక అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఏ విధంగా వాడుకుంటుందో చూడాలి. ఇంకా ఈమె నటించిన విరాటపర్వం విడుదల కావాల్సి ఉంది.

 కాగా ప్రియమణి ప్రస్తుతం డీ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే నారప్ప రిలీజ్ తర్వాత ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తడంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ షో నుండి ప్రస్తుతానికి తాత్కాలికంగా వైదొలగడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమె డీ షో యాజమాన్యంతో భేటీ అయి ఈ విషయాన్ని సానుకూలంగా వివరించినట్లు చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: