తెలుగు చిత్ర పరిశ్రమ ఈ మధ్య ఓ సరికొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్న విషయం మీకు తెలుసా? అదేనండి రీమేక్ ల ట్రెండ్. యువ హీరో దగ్గర్నుంచి అగ్ర హీరోల వరకు చాలామంది నటులు ఈ మధ్య ఇతర భాషా సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. మంచి కంటెంట్ ఉండి వివిధ భాషల్లో ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమాలను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అందులో పలు మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మలయాళంలో హిట్టయిన సినిమాలను మన తెలుగు హీరోలు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో మలయాళ సినిమాపై కన్నేశారు మన నిర్మాతలు.

మలయాళం లో ఈ ఏడాది విడుదలైన 'నయట్టు' అనే సినిమా మంచి విజయాన్ని సాధించింది.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని మార్టిన్ ప్రక్కట్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ ఇదే సినిమాని తెలుగులో రీమేక్ చేసే పనిలో పడింది గీతా ఆర్ట్స్ సంస్థ.ఈ మేరకు అల్లు అరవింద్సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు మార్టిన్ అధికారికంగా ప్రకటించారు.అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.ఈ సినిమాని తెలుగులో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని రీమేక్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారట.ఈ నేపథ్యంలో తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనుండగా.. హిందీలో మాత్రం జాన్ అబ్రహం నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది.దీంతో కచ్చితంగా ఈ రీమేక్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమా రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లో వెల్లడి కానున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: