తళుకు బెళుకుల తమన్నా టాలీవుడ్ కి వచ్చి దశాబ్దరన్న కాలం గడచిపోయింది. తమన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇపుడు అద్భుతమైన రోల్స్ ని పోషిస్తూ తనకంటూ కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తమన్నా ఇంకా నాటౌట్ అంటోంది.


ఈ అమ్మడుకు మూడు పదుల వయసు దాటింది. నిజానికి తమన్నాతో ఎంట్రీ ఇచ్చిన వారు ఇపుడు కనబడడంలేదు. తమన్నా తరువాత వచ్చిన వారు కూడా సైడ్ అయిపోయారు. కొత్త వారు వెల్లువలా వస్తున్నారు. అయినా కూడా టాలీవుడ్ లో తమన్నా తళుకులు ఎక్కడా మసకబారడంలేదు. దానికి గల కారణాలు ఏంటి అని ఆరా తీస్తే చాలానే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా తమన్నా వ్యక్తిత్వం. ఆమె చాలా కూల్ నేచర్ అని చెబుతారు.


తమన్నా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినపుడు ఎలా ఉందో ఇంత స్టార్ డమ్ సాధించిన తరువాత కూడా అలాగే ఉందని అంటున్నారు. ఆమె నిర్మాతలకు పూర్తి కోపరేటివ్ అని చెబుతారు. ఆమె సినిమా నిర్మాణంలో తన పూర్తి సపోర్ట్ ఇస్తారు. మేకర్స్ ని ఎక్కడా ఇబ్బంది పెట్టరని చెబుతారు. ఇక తమ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె పట్టు బట్టి కొండ మీద కూర్చోరు అని కూడా అంటారు. తమన్నా ఒక సినిమాను ఒప్పుకున్నాక పేచీలు గొడవలు అసలు ఉండవు. చెప్పిన టైమ్ కి వచ్చి షూటింగ్ చేయడం ఆమె స్పెషాలిటీ. ఇలా ఆమె మేకర్స్ కి తన వంతుగా సహకారం అందించడం వల్లనే ఆమెను అంతా కోరుకుంటారు.


తమన్నా ఇండస్ట్రీలో మరింతకాలం కూడా ఇలాగే విజయవంతంగా కొనసాగుతారు అనడానికి ఆమె ఏర్పాటు చేసుకున్న క్రమశిక్షణే కారణమని  అంటారు. మొత్తానికి తమన్నాను చూసి కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది అంటున్నారు. తమన్నాకు చేతినిండా ఆఫర్లు ఉన్నాయంటే అది ఆమె గొప్పతనం తప్ప వేరొకటి కానే కాదు అని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: