పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వీరిద్దరు సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా  చాలా క్లోజ్ గా ఉంటారని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.అయితే వీరిద్దరి మధ్య ఇంత ఈ బాండింగ్ రావటానికి కారణం ఏంటి? అసలు ఇద్దరు కలిసినప్పుడు ఏమి మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి సినిమా అభిమానుల్లో చాలా ఎక్కువగా ఉంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి.. త్రివిక్రమ్ కలిసినప్పుడు ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటారని అందరూ అనుకుంటుంటారు. అయితే సినిమాల కంటే కూడా సాహిత్యం ఇంకా పుస్తకాల గురించి తరచూ ఇద్దరూ చర్చించుకుంటారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 

ఇక వీరి ఫ్రెండ్ షిప్ సీక్రెట్ కూడా అదేనట.ఇక దీనికి ఉదాహరణగా చెప్పుకొనే సందర్భం ఒకటి నిన్న శుక్రవారం జరిగింది.ఇక ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను నిన్న సాయంకాలం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలవడం జరిగింది. సాహిత్య ప్రియులైన వీరిద్దరూ కూడా ఎక్కువగా మహాకవి శ్రీశ్రీ రచనల గురించి.. ఆయన కలం నుంచి వచ్చిన 'మహా ప్రస్థానం' గురించి చర్చించుకోవడం జరిగిందట. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీ చేతిరాతతో కూడిన 'మహా ప్రస్థానం' ప్రత్యేక స్మరణికను త్రివిక్రమ్ కు గిఫ్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు.'మహా ప్రస్థానం' పుస్తక ముద్రణ గురించి అందులోని అరుదైన చిత్రాల గురించి కూడా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇక వీరిద్దరి కలయికలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. ఇక భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాకి కూడా త్రివిక్రమ్ మాటలు రాసిన సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: