ప్రస్తుతం ఏపీలో తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు . అక్కడ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమా పరిశ్రమ పెద్దలను కలవరపెడుతున్నాయని తెలుస్తుంది..

ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నా కూడా తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ పద్ధతిని తీసుకురావడం మరింత ఆందోళన కలిగిస్తుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు సినీ పెద్దలు ఎవరూ నోరు తెరవలేదని తెలుస్తుంది. కానీ టికెట్ల ధరలు తగ్గించడంపై ఇప్పటికీ నిర్మాతలు మండిపడుతూనే ఉన్నారని సమాచారం. జగన్‌ను సినీ పెద్దలు కలిసి ఏదో ఒకటి తేల్చాలని మొరపెట్టుకుంటున్నారని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో పరిశ్రమ పెద్దలు మరియు టికెట్ల అమ్మకాలపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

సినీ ప్రముఖులు కోరితేనే ప్రభుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా చెప్పారని సమాచారం.మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున వంటి వాళ్లు వచ్చి కోరితేనే ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్ల అమ్మకానికి నిర్ణయం తీసుకుందని రోజా చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోందని సమాచారం.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలైన సమయంలోనే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించిందని తెలుస్తుంది. దీంతో అసలు సమస్య మొదలైందని సమాచారం. ఈ రేట్లతో టికెట్లు అమ్మితే తమకు గిట్టుబాటు కాదంటూ ఎగ్జిబిటర్లు చేతులెత్తేస్తున్నారని తెలుస్తుంది. అందుకే చాలా సినిమాలను విడుదల చేయట్లేదని తెలుస్తుంది.. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయని అందరికి తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నుంచి మొదలు పెట్టుకుని ఎన్టీఆర్‌ మరియు రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ వరకు చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. అయినా కూడా ఈ పెద్ద సినిమాలు విడుదల తేదీ గురించి ఆలోచించడం లేదని తెలుస్తుంది.ఏదో ఒకటి తేలిన తర్వాతనే సినిమాలు విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారట. ఎలాగైనా సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు జగన్‌ను ఒప్పించాలని సినీ పరిశ్రమ చూస్తుంటే.. ఏకంగా టికెట్ల అమ్మకం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని తెలుస్తుంది.ఇలాంటి సమయంలో సినీ పెద్దలు చెప్పినందుకే జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని రోజా చెప్పడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: