అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వస్తోందనే అంచనాల నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాతలు సినిమా మీద ఉన్న నమ్మకంతో సినిమా అప్పుడు విడుదల చేయకుండా వాయిదా వేశారు. కరోనా రెండవ వేవ్ తగ్గిన తర్వాత సెప్టెంబర్ నెలలో 10 వ తారీఖున వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే ఈ సినిమాతో పాటు ఏప్రిల్ నెలలో విడుదల కాకుండా వాయిదా పడిన నాని 'టక్ జగదీష్' సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మడంతో వాళ్ళు పదో తేదీన రిలీజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో తమ సినిమా కలెక్షన్లు తేడా వస్తాయనే ఉద్దేశంతో సినిమా రిలీజ్ చేయకుండా ఆపారు లవ్ స్టోరీ నిర్మాతలు.

అలా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఎట్టకేలకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుంచి సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమాలో సాయి పల్లవి నటన, నాగచైతన్య పర్ఫార్మెన్స్, శేఖర్ కమ్ముల టేకింగ్ అన్నీ కలిసి సినిమాకు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే సినిమా మొత్తం మీద సెన్సిటివ్ ఇష్యూను ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్లడంలో శేఖర్ కమ్ముల తడ పడినట్లు అనిపిస్తోంది అనే రిపోర్టులు వెలువడుతున్నాయి. తాజాగా వెలువడుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా మొదటి రోజు 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరీ ముఖ్యంగా అమెరికాలో అయితే ఈ ఏడాది మొత్తంలో మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వకీల్ సాబ్ సినిమా అమెరికా ప్రీమియర్ కలెక్షన్ల కంటే ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 11 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా మిగతా భారతదేశం మొత్తం మీద సుమారు కోటి రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక అమెరికా సహా మిగతా దేశాలలో 5 కోట్ల 35 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అలా ఈ సినిమా భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అన్ని సినిమాలలో మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మొన్నటి దాకా గోపీచంద్ సిటిమార్ సినిమాకు ఆ కలెక్షన్ల విషయంలో ముందు ఉండగా ఇప్పుడు దానికి రెండింతల కలెక్షన్లు రాబట్టింది లవ్ స్టోరీ సినిమా. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలీవుడ్ సినిమాల కంటే ముందు మన లవ్ స్టోరీ, సిటిమార్ సినిమాల నిలవడం.

మరింత సమాచారం తెలుసుకోండి: