మన టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఇప్పుడు వెబ్ సీరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా, నాగార్జున లాంటి అగ్ర తారలు ఓటీటీ కంటెంట్స్ అయిన వెబ్ సీరీస్ ల వైపు అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఇక మన అక్కినేని నాగ చైతన్య కూడా త్వరలోనే ఓ మంచి హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో ఈ వెబ్ సీరీస్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా సూపర్1స్టార్ మహేష్ బాబు సైతం ఓటీటీ ఎంట్రీ పై ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసాడు.ఇటీవల బిగ్ సి బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, అలాగే వెబ్ సీరీస్ లో నటించే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో మహేష్ మాట్లాడుతూ..'నేను ఎప్పుడూ వెబ్ సీరీస్ చేయాలని అనుకోలేదు.ప్రస్తుతం నేను వాటిని చూసే పనిలో మాత్రమే ఉన్నాను.ఇక ఇప్పటివరకు నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు.కానీ ఎవరికి తెలుసు. భవిష్యత్ లో ఉండవచ్చు'.. అంటూ మహేష్ బాబు వివరణ ఇచ్చారు.దీన్ని బట్టి మహేష్ బాబుకి వెబ్ సీరీస్ లలో నటించే ఇంట్రెస్ట్ ఉందని,అంతేకాకుండా ఫ్యూచర్ లో అవకాశం వస్తే1కచ్చితంగా వెబ్ సీరీస్ లో నటిస్తారని అర్ధమవుతుంది.ఇక ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట'సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బ్యాంక్ కుంభకోణాల బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఆయన సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ రాగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది.మహేష్ కెరీర్లో ఇది 28 వ సినిమా కావడం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: