రెజీనా పట్టువదలని విక్రమార్కునిలా సినీ ఇండస్ట్రీలో పోరాడుతూనే ఉంది. హిట్ కోసం తెగ కష్టపడుతోంది. ఫ్లాపులు ఎదురవుతున్నా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. దీంతో దర్శక,నిర్మాతలకు ఈ బ్యూటీ ఎప్పుడూ అందుబాటులో ఉంటోంది. నో అని చెప్పకుండా ఎవరు పిలిచినా వెళ్లిపోతోంది. రెమ్యురేషన్ విషయంలోనూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే ఒక్క హిట్ అయినా రాకపోతుందా.. మళ్లీ బిజీ కాకపోతామా అని రెజీనా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ ఇప్పటివరకు రెజీనా ఎదురుచూపులకి తెరపడలేదు. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీస్‌ తిరిగినా కెరీర్ మాత్రం మారలేదు. ఇలాంటి సమయంలో ఒక క్రేజీ ఆఫర్ అందుకుంది రెజీనా.

రెజీనాకి 'జ్యో అచ్యుతానంద' తర్వాత మళ్లీ హిట్‌ లేదు. అయిదేళ్లుగా రెజీనాకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కోలీవుడ్ లోనూ సరైనా విజయం రాలేదు. దీంతో ఈ హీరోయిన్‌ సినీ కెరీర్‌ ఇక అయిపోయినట్టేనని అందరూ అనుకున్నారు. సైనా హిట్ పడితే గానీ.. మళ్లీ జనాలకి దగ్గరయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో షాహిద్‌ కపూర్‌తో కలిసి నటించే అవకాశం అందుకుంది రెజీనా.

షాహిద్‌ కపూర్‌ ప్రస్తుతం రాజ్, డీకె దర్శకత్వంలో ఒక వెబ్‌ సీరీస్‌ చేస్తున్నాడు. 'ఫ్యామిలీమెన్' సీరీస్‌తో నేషనల్‌ వైడ్‌గా పాపులర్ అయిన రాజ్, డీకె తీస్తోన్న ఈ వెబ్‌ సీరీస్‌పై ఎక్స్ పెక్టేషన్స్ హైలెవల్ లో ఉన్నాయి. ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్నారో అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ సీరీస్‌లోనే నటిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రెజీనా.

షాహిద్ కపూర్‌తో పాటు, విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వీళ్లతోపాటు రెజీనా కూడా ఒక ఇంపార్టెంట్‌ రోల్ ప్లే చేయబోతోంది. మరి ఈ వెబ్‌ సీరీస్‌తో రెజీనా కెరీర్‌ ఎలాంటి మలుపు తీసుకుంటుంది, సమంతలా వెబ్‌ సీరీస్‌తో నార్త్ మార్కెట్‌లో కూడా గుర్తింపు తెచ్చుకుంటుందా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: