మన టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో హీరోయిన్ల కొరత అనేది ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య వల్లే వారి షూటింగ్స్ కూడా ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ప్రతి సీనియర్ హీరో కి ఇప్పుడు ఇదే సమస్య. ఆ సమస్య మన నటసింహ నందమూరి బాలకృష్ణకు పలుమార్లు వచ్చింది. తాజాగా బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా కోసం కూడా హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం బోయపాటికి పెద్ద టాస్క్ గా మారింది. బాలయ్య కోసం ఎంతో కష్టపడి చివరికి ప్రగ్యా జైస్వాల్ ని ఫైనల్ చేశాడు బోయపాటి.

 ఇక ఇప్పుడు మరో సారి బాలయ్య సినిమాకు హీరోయిన్ సమస్య వచ్చింది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించారు మేకర్స్. మొదట శృతిహాసన్ పేరు వినిపించింది. అయితే ఆమె బాలయ్యతో నో చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో గోపీచంద్ మలినేని కొంతమంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అయితే మళ్లీ శృతిహాసనే గోపీచంద్ మలినేని మీదున్న గౌరవంతో బాలయ్యతో నటించడానికి ఒప్పుకుందట.

ఇటీవల గోపీచంద్ డైరెక్ట్ చేసిన 'క్రాక్' సినిమాతోనే తన సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో 'సలార్' సినిమాలో నటిస్తోంది. ఇక ఇప్పటికే తన డేట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. బాలయ్యతో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుందట శృతిహాసన్. ఇక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి రెండు విభిన్న తరహా పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టుని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం, అటు క్రాక్ వంటి భారీ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్టును తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: