బిగ్‌బాస్ సీజ‌న్ 5 కూడా గ్రాండ్‌గా ఆరంభ‌మై స‌క్సెస్‌పుల్‌గా ర‌న్ అవుతోంది. దీనిపై ఎన్నో ట్రోల్స్ వ‌చ్చినా.. ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా.. మంచి టీఆర్పీ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోతున్న‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్న చిన్న వివాదాలు, ట్రోల్స్‌ ఈ షోకు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేకపోతూ ఉన్నాయి. అయితే ఇక ఈ షోలోకి వ‌చ్చే కంటెస్ట్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి మ‌రీ తీసుకువ‌స్తార‌ని టాక్ వినిపిస్తోంది. వారి ఫాలోయింగ్‌, గుర్తింపును బ‌ట్టి వారానికింత అని రెమ్యున‌రేష‌న్ ఫిక్స్ చేస్తుంటారని.. ఇక ఎన్ని వారాలు షోలో ఉంటే అన్ని వారాల పాటు రెమ్యున‌రేష‌న్ ఇస్తుంటారు.అయితే ఫైన‌ల్ విజేత‌కు మాత్రం భారీ రెన్యుమ‌రేష‌న్ ముట్ట‌జెపుతుంటారు.

 గతంలో బిగ్ బాస్ షో లో ఫైన‌ల్‌లో విజ‌యం సాధించిన‌ విజేతలకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ తాజాగా ఈ సీజన్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ‌తో పాటు మరో అదిరిపోయే ఆఫర్ ను కూడా ఇచ్చారు. బిగ్ బాస్ లో పోటీ చేసే కంటెస్టెంట్స్ కు వారానికింత అని  రెమ్యునరేషన్ ఇస్తారు. ఇది కాకుండా ఫైనల్ వరకు వచ్చి ఫైనల్ లో గెలిచిన విజేతకు ప్రైజ్‌మనీ అన్ని సీజ‌న్ల‌లో ఇచ్చారు.  తాజాగా ఈ సీజన్ విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ‌తో పాటు మరో అదిరిపోయే ఆఫర్ కూడా  ఇచ్చింది బిగ్ బాస్. ఈ ఆఫర్ ను నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ తో  వెల్ల‌డించారు.

ఈ సీజ‌న్‌లో విజేత‌కు 50 ల‌క్ష‌ల రూపాయాల‌తో పాటు అద‌నంగా ఇల్లు నిర్మించుకోవ‌డానికి ఓ స్థ‌లం కూడ క‌ల్పించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు నాగార్జు. ఈ విష‌యాన్ని ఆదివారం రోజు వీఎండ్ ఎపిసోడ్‌లో నాగార్జున అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసాడు. అయితే బిగ్‌బాస్ విన్న‌ర్ రూ.50ల‌క్ష‌ల‌తో పాటు షాద్‌న‌గ‌ర్‌లోని సువ‌ర్ణ‌కుటీర్‌లో రూ.25 ల‌క్ష‌ల విలువైన 300 చ‌ద‌ర‌పు గ‌జాలు క‌లిగిన స్థ‌లాన్ని గెలుచుకుంటారు అని నాగార్జున చెప్పాడు. అయితే  ఈ ప్లాట్‌ను మాత్రం ఆ సంస్థ తమ ప్రమోషన్ కోసం ఇస్తున్నట్టు  తెలుస్తోంది.  దీనితో ఈ సారి  సీజ‌న్‌లో విజేతకు  పంట పండినట్లే అని ప‌లువురు భావిస్తున్నారు. అయితే ఈ వారం బిగ్‌బాస్ నుంచి యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయ్యారు. దీంతో యాంక‌ర్ ర‌వికి అన్యాయం జ‌రిగింద‌ని అన్న‌పూర్ణ స్టూడియో ద‌గ్గ‌ర తెలంగాణ జాగృతి కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: