తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబినేషన్లో ఇటీవల వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒక దానిని మించేలా మరొకటి ఎంతటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి అనేది మనకి అందరికీ తెలిసిందే. ఆ రెండు సినిమాల్లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేసారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ముచ్చటగా మూడవసారి పని చేసిన సినిమా అఖండ.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి తీసిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మూవీ పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకుంది. ముఖ్యంగా సినిమాలో అఘోరాగా, అలానే మధ్య తరగతి రైతుగా బాలయ్య నటన అద్భుతం అనే చెప్పాలి. అఖండ పాత్రలో ఆయన చూపించిన పెర్ఫార్మన్స్, డైలాగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయి అనే చెప్పాలి. థమన్ అందించిన సాంగ్స్ కి బాలయ్య తన మార్క్ స్టెప్స్ తో అదరగొట్టారు. హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన అందంతో అలరించింది.

అయితే సినిమా లో భారీ యాక్షన్, మాస్ సీన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు బోయపాటి కథ ని కూడా మరింతగా ఆలోంచించి తీసి ఉంటె అఖండ సూపర్ హిట్ కొట్టి ఉండేదనేది ప్రేక్షకుల అభిప్రాయం. అయితే మొత్తంగా నేడు విడుదలైన ఈ అఖండ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం బాగా నచ్చుతుంది. కాగా నేడు అఖండ విజయం పై బాలయ్య సహా మూవీ యూనిట్ మొత్తానికి పలువురు సినిమా ప్రముఖులు అభినందనలు తెలియ చేస్తుండగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయిడు తన బావ బాలయ్య కు అఖండ మూవీ యూనిట్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: