మొన్నటిదాకా కరోనా చిత్ర పరిశ్రమను చిందరవందర చేసింది. రెండవ సారి కూడా ఇదే కరోనా వచ్చి సినిమా పరిశ్రమను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు మూడవ సారి  కూడా ఓమిక్రాన్ రూపంలో మరో మాయదారి రోగం సినిమా పరిశ్రమను దెబ్బతీయడానికి ముందుకు రాబోతుంది. డిసెంబర్ లో భారీ సినిమాలు విడుదలకు ఉన్నాయి. జనవరిలో దేశంలోనే అతి పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాలకు ఈ ఒమిక్రన్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అని నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారట.

కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే భారతీయ సినిమా పరిశ్రమ కోలుకుంటుంది. తెలుగులో అఖండ బాలీవుడ్ లో సూర్యవంశి చిత్రాలు సక్సెస్ కావడంతో ఆడియన్స్ కూడా ఇప్పుడిప్పుడే థియేటర్లకు రావడం మొదలయ్యింది. ఇక రాబోయే సినిమాలు కూడా మంచి సక్సెస్ అయితే టాలీవుడ్ కు పూర్వవైభవం రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. వరుస సినిమాల రిలీజ్ లతో సక్సెస్ లతో టాలీవుడ్ ట్రాక్ లో పడ్డట్లే అనుకునేలోపే ఇప్పుడు మూడో గండం ఓమిక్రన్ రూపంలో వస్తుంది. కరోనా పేద విరగడ అయ్యింది అన్న ఆనందం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో పుష్ప మరియు జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోయే సినిమాల పరిస్థితి ఏంటి అని నిర్మాతలు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సీజన్ ను రాజమౌళి ఎంతో గ్రాండ్ గా మొదలుపెట్టనున్నాడు. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల కోట్లకు పైగా కలెక్శన్స్ ఎక్పెక్ట్ చేస్తుంది. మరి ఒమీక్రాన్ పెరిగితే ఈ సినిమా కలెక్షన్ల సంగతి ఏమిటో చూడాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 న విడుదల అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం జనవరి 14వ తేదీన విడుదల అవుతుంది. ఇంకా వేసవిలో కూడా మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటి పరిస్థితి ఏమిటో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: