ఇక అనంతరకాలంలో హిందీలో వచ్చిన జిందగీ తెలుగులో ఆడబ్రతుకు చిత్రంగాను, దూర్ గగన్ కీ చాహో మే మూవీ రాము సినిమా గాను, ప్రొఫెసర్ చిత్రం భలే మాస్టారుగా, చైనా టౌన్ .. భలే తమ్ముడుగా తారకరాముడు హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తరువాత బాలీవుడ్లో ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన జంజీర్ సంచలన విజయం సాధించడంతో దానిని తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నిప్పులాంటి మనిషిగా తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. యాదోంకీ బారాత్ చిత్రం అన్నదమ్ముల అనుబంధంగా, జానీ మేరానామ్ మూవీ ఎదురులేని మనిషిగా, దీవార్ మగాడుగా, డాన్ చిత్రం యుగంధర్ గా తెలుగులో తెరకెక్కాయి. ఎన్టీఆర్ నటించిన ఆరాధన, నేరం నాదికాదు ఆకలిది, మా దైవం, మేలుకొలుపు, లాయర్ విశ్వనాథ్, కేడీ నెంబర్ 1, ఎదురీత వంటి చిత్రాలన్నీ హిందీ రీమేక్లేనంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ ఇది నిజం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు నటించిన నాదేశం చిత్రం కూడా అమితాబ్ హీరోగా వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ లావారిస్ కు రీమేక్ కావడం విశేషం. ఈ జాబితా చూశాక ఈ విషయంలోనూ ఎన్టీఆర్ రికార్డును మరే హీరో అందుకోలేరనే చెప్పాలేమో.