సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని సంపాదించడానికి ఒక్క హిట్ సినిమా చాలు. అయితే కొన్ని సార్లు హిట్ దక్కకపోవచ్చు కానీ హిట్ కొట్టి దమ్ము ఉంది అనే పేరు దక్కుతుంది. దాని వెంటే 3,4 ఆఫర్లు కచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇక ఆ నాలుగు సినిమాలో ఆఫర్ లను చూసి మురిసిపోయి కోటి రూపాయల రెమ్యూనరేషన్ కావాలి లేదా రెండు కోట్లు కావాలి అంటూ డిమాండ్ కు దిగుతారు. ఇకపోతే అందులో ఒకరైన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అలాగే తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసింది. అయితే కృతి శెట్టి కి ఉప్పెన సినిమా కంటే ముందే బంగార్రాజు మరియు విషయం శ్యామ్ సింగా రాయ్  సినిమా ఆఫర్లు రావడం జరిగింది.

అంతలోనే ఓపెన్ ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ముందుగా ఆఫర్లు వచ్చినా ఆ రెండు సినిమాలతో పని లేకుండా ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలే కాకుండా ఈ సినిమాలతో పాటు మరో మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టింది కృతి శెట్టి అయితే కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయట. అయితే ఈ రేంజ్లో సినిమాల తర్వాత సినిమాలు చేస్తుంది కృతి శెట్టి అని చెప్పొచ్చు ఈ తరహాలో సినిమాలు ఎవరు కూడా చేయడం లేదు. దీంతో మీడియం రేంజ్ సినిమాలకు దొరక్కుండా పోయింది కృతి శెట్టి.

అయితే ఈ కృతి శెట్టి ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మీడియం రేంజ్ సినిమాలో కృతి శెట్టి నటించడంలేదు. అందుకే ఆ ప్లేస్లో పెళ్లి సందడి సేమ్ శ్రీలీల తో సర్దుకుపోతున్నారు. శ్రీలీల పెళ్లి సందడి సినిమా బీసీ సెంటర్లలో బాగానే ఆడింది అని టాక్ ఉంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి నాలుగు సినిమాల ఆఫర్లు వచ్చాయట. అయితే తనకు వరుస సినిమా ఆఫర్లు రావడంతో ఎంత పారితోషికం తీసుకోవాలో తనకి పాలుపోక కోటి మాత్రమే అడుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ భామ రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో తనకు జోడీగా నటిస్తోంది. అంతేకాకుండా ఈమె సితార సంస్థలో రెండు చిత్రాలకు ఆమె సైన్ చేసింది.  నిర్మాత దిల్ రాజు కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: