మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివతో ఆయన చేస్తోన్న సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక 'ఆర్ఆర్ఆర్' లాంటి దేశం మెచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ సెటప్ మొత్తం కూడా చూస్తుంటే గతంలో కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనుకొని ఆగిపోయిన సినిమానే అందరికి గుర్తొస్తుంది.ఇక కొరటాల శివ దర్శకత్వంలో అప్పుడు బన్నీసినిమా చేయాలనుకున్నారు. అలాగే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నట్లు సమాచారం.


అయితే ఈ సినిమా టైటిల్ చెప్పలేదు కానీ ఎన్టీఆర్ చేతిలో ఆయుధం, సముద్రం ఇంకా లైట్ హౌస్.. ఈ సెటప్ మొత్తం అంతా కూడా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.అప్పుడు అల్లు అర్జున్ తీసుకున్న డెసిషన్ అనేది సరైనదో కాదో.. ఈ సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఇక ఈ సినిమా కోసం దేశంలోనే మంచి పేరున్న టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపారు. తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ఇంకా శ్రీకర్ ప్రసాద్ ఇలా పాన్ ఇండియా లెవెల్ టీమ్ ని కూడా సెట్ చేశారు. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: