తాజాగా బాలీవుడ్ లో మున్నా మైఖెల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ నిధి అగర్వాల్.అయితే  ఆ క్రేజ్ తో తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాలో ఛాన్స్ అందుకుంది.ఇకపోతే చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు.ఇక  ఆ తర్వాత తన సెకండ్ సినిమానే అక్కినేని హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ఞు సినిమాలో అందుకుంది నిధి అగర్వాల్.కాగా  ఆ సినిమా కూడా అమ్మడికి హిట్ ఇవ్వలేదు. పోతే ఇక థర్డ్ మూవీగా పూరీ జగన్నాథ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ అమ్మడికి సూపర్ హిట్ ఖాతా తెరచింది.

అయితే ఆ సినిమాలో నిధి అగర్వాల్ రెచ్చి పోయి మరి అందాల ప్రదర్శన చేసింది. కాగా అక్కడ అమ్మడికి ఆడియెన్స్ లాక్ అయ్యారు. ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత వరుస లక్కీ ఛాన్సులు అందుకుంటుంది. అయితే గల్లా అశోక్ హీరోగా వచ్చిన హీరో సినిమాలో నటించిన అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.ఇక  ఈ సినిమా తర్వాత ఇద్దరు టాలీవుడ్ సీనియర్ హీరోలతో నిధి అగర్వాల్ జోడీ కడుతుందని అంటున్నారు.ఇక ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు నందమూరి బాలకృష్ణ,

మరొకరు మెగాస్టార్ చిరంజెవి అని అంటున్నారు.అయితే  బాలకృష్ణ, అనీల్ రావిపుడి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేశారట.ఇక  ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్ లో సినిమాకు కూడా నిధి అగర్వాల్ పేరుని సజెస్ట్ చేస్తున్నారట.అయితే  ఈ రెండు సినిమాల్లో చేస్తే మాత్రం నిధి అగర్వాల్ ఖచ్చితమా సూపర్ పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలావుంటే ఇప్పటికే యూత్ లో ఆమెకి భారీ ఫాలోయింగ్ ఉంది. సీనియర్ హీరోలతో జోడీ కడితే తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అనుకున్నా తగినంత రెమ్యునరేషన్ వస్తున్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎలా వదుకోవాలని అంటుంది నిధి అగర్వాల్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: