బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రష్మీ కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కూడా ఆమె నటించారు.


ఇలా వెండితెరపై పలుసు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కేవలం బుల్లితెర కార్యక్రమాలకు మాత్రమే ఆమె పరిమితమయ్యారు.ఇలా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె ఈ కార్యక్రమంతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన ఈమె సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న


శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి సుధీర్ వెళ్లిపోవడంతో ఆ కార్యక్రమానికి కూడా ఆమె యాంకర్ గా మారిపోయారు. అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ వెళ్ళిపోవడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ వారంలో మూడు రోజులు పాటు ప్రేక్షకులను సందడి చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై రష్మి స్పందిస్తూ కొత్త యాంకర్ వచ్చేవరకు నన్ను అందరూ భరించండి ప్లీజ్ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్  కూడా చేశారు.


 


ఈ పోస్ట్ పై నటి లైలా స్పందించారు.లైలా గతంలో కొద్దిరోజులపాటు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో రష్మికి లైలాకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే రష్మీ చేసిన పోస్ట్ పై లైలా స్పందిస్తూ… రష్మీ నువ్వు ఏ షో నైనా అదరగొట్టేస్తావు.. యు విల్ రాక్ ది షో… నువ్వు యాంకరింగ్ చేస్తే…నీ యాంకరింగ్ ద్వారా ఏ షోకైనా ప్రాణం పోస్తావు అంటూ ఈమె కామెంట్ కూడా చేశారు.


 


ఈ విధంగా రష్మీ పోస్ట్ పై లైలా స్పందిస్తూ చేసిన ఈ కామెంట్ పై రష్మీ రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ మేడం ఈ మాటలు చాలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి అంటూ రష్మీ చెప్పుకొచ్చారట.ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరింత సమాచారం తెలుసుకోండి: