మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. తమన్నా ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే తమన్నా అనేక సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి తన అంద చందాలతో ,  డాన్స్ లతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే తమన్నా 'ఎఫ్ 3' మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా తమన్నా , దత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా 'బాహుబలి' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

అసలు విషయం లోకి వెళితే ... బాహుబలి సినిమా నా కెరీర్ కి చాలా బాగా ఉపయోగపడింది అని, పక్కింటి అమ్మాయి లా కాకుండా ఆర్టిస్ట్ ల తన సత్తాను ప్రజలు గ్రహించేలా బాహుబలి మూవీ చేసింది అని తమన్నా తాజాగా బాహుబలి మూవీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాహుబలి సినిమా ద్వారా  తమన్నా పాన్ ఇండియా రేంజ్ లో  అదిరిపోయే గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మిల్కీ  బ్యూటీ తమన్నా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: