"భీమ్లా నాయక్ " సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ "హరిహర వీరమల్లు" లాంటి ఎపిక్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు చారిత్రక చిత్రాలు తీయడంలో పేరున్న 'క్రిష్ జాగర్లమూడి' దర్శకత్వంలో వస్తుండటంతో టాలీవుడ్ కలెక్షన్లు కొల్లగొడుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్రత్యేక చొరవ తీసుకుంటోందట.. సహజంగానే హరిహర వీరమల్లు సినిమాపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.సినిమా భారీ బడ్జెట్ తో రూపొందడంతో కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. సినిమా ఇప్పటికే అరవై శాతం పూర్తి అయ్యింది. త్వరలోనే విడుదల చేసేందుకు చకచకా నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్ మరో ప్రభంజనం సృష్టించడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమైనా విడుదల మాత్రం వచ్చే సంక్రాంతికి ఉంటుందని అభిమానుల అంచనా. ఇటీవల పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా చిన్న గ్రిమ్స్ రిలీజ్ చేయడంతో అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.సినిమాలో ఓ సన్నివేశంలో జనసేన ప్రస్తావన ఉంటుందని ఆశిస్తున్నారు.


సినిమాలో విలన్ ను ప్రశ్నించే డైలాగు లో 'జనసేన' అంటూ పవన్ కల్యాణ్ పలుకుతారని.. ఇది రాజకీయాలతో సంబంధం ఉంటుందని చెబుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో ఏపీ రాజకీయాలను పవన్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. పవన్ చెప్పే మాటలతో వేల మంది ఆయన వెనుక వస్తారని.. ఇది జనసేనతో లింక్ పెట్టారని అంటున్నారు.హరిహర వీరమల్లుతో పవన్ మరో హిట్ సాధిస్తారని ప్రేక్షకుల అంచనా. క్రిష్ దర్శకత్వ ప్రతిభపై అందరికి నమ్మకం ఉంది. ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరికి మరోమారు సవాలు విసరాలని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు క్రిష్  చాలా కష్టపడుతున్నారు. పవన్ కల్యాణ్ నటన ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జనసేన పార్టీని ముందుకు నడిపించే క్రమంలో సినిమాల్లో కూడా కొన్ని సీన్లు పెడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసమే అన్ని అస్త్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: