స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న అలియా భట్ అంటే అందరికీ సుపరిచితమే.ఈ మధ్యనే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటించి తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది.ఈ మధ్యనే బ్రహ్మస్త్ర సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె సినీ కెరియర్ పక్కన పెడితే..అలియా భట్ తను ఎంతగానో ప్రేమించిన రన్బీర్ కపూర్ ని పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక పెళ్లి చేసుకున్న రెండు నెలలకే గుడ్ న్యూస్ అంటూ తన బేబీ స్కానింగ్ ఫోటోని

 సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.ఏంటి పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల ఎలా సాధ్యం అంటూ అవాక్కయ్యారు.ఈ బ్యూటీ ఈ మధ్యనే ఒక పండంటి ఆడబిడ్డ కు కూడా జన్మనిచ్చింది. బిడ్డ పుట్టక కూడా అలియా భట్ చాలా ట్రోలింగ్ కి గురైంది.అయితే  పెళ్లయిన ఏడు నెలలకే బిడ్డ పుట్టడం ఎలా?హౌ..?అంటూ చాలామంది ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.ఇకపోతే ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వారి మాటలు పట్టించుకోకుండా ఆలియా భట్ ప్రస్తుతం తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది అలియా భట్. ఆమె మాట్లాడుతూ.. నేను కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చాను.అయితే  అసలు ఆ టైంలో హీరోయిన్ అవ్వడానికి నా బాడీ సెట్ అవ్వదు.కానీ ఎలాగైనా ఇండస్ట్రీలో ఎదగాలి అనే పట్టుదలతో హీరోయిన్ ఫిజిక్ తెచ్చుకోవడం కోసం ఎన్నో వర్క్ అవుట్ లు, ఎక్సర్సైజులు చేశాను. అంతేకాదు  ఇక  చాలావరకు బుక్స్ కూడా చదివాను.ఇప్పటికి కూడా నా శరీరం విషయంలో నేను చాలా డిస్సప్పాయింట్ గా ఉన్నాను. నా బాడీ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు నా బాడీ విషయం లో నేను హ్యాపీగా లేను అంటూ తాజాగా అలియా భట్ తన గురించి కొన్ని సెన్సేషనల్ విషయాలు బయటపెట్టడంతో ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి.ఈమె మాటలు విన్న నెటిజెన్స్ అందరూ కోట్లకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక నీ బాడీ విషయంలో ఎందుకు బాధపడుతున్నావ్ ఆలియా.అయితే  డబ్బులతో నీ బాడీ ని నీకు నచ్చినట్టు తయారు చేసుకో ఈ విషయంలో ఏం బాధపడకు అంటూ నెటిజెన్స్ ధైర్యం చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: