పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ "భీమ్లా నాయక్" మూవీ తో సూపర్ సక్సెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అంతకు ముందు వకీల్ సాబ్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కొంత కాలం క్రితమే తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయం అందుకున్న వినోదయ సీతం అనే రీమేక్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసింది. 

మూవీ షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక ఫోటోను కూడా విడుదల చేసింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ మరియు ఈ సినిమా దర్శకుడు సముద్ర కని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: