మాస్ మహారాజా రవితేజ తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇక రవితేజ కెరియర్లో సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో క్రాక్ మూవీ ఒకటి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే ముందే రవితేజ , గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన డాన్ శీను , బలుపు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించి ఉండడంతో క్రాక్ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమా కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లలో విడుదల అయింది. అలాంటి సమయంలో విడుదల అయిన కూడా ఈ మూవీ జనాలను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ తర్వాత కూడా రవితేజ , గోపీచంద్ మలినేని కాంబోలో ఓ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. మరోసారి రవితేజ , గోపీచంద్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా క్రాక్ మూవీ కి కొనసాగింపుగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా క్రాక్ మూవీ కి కొనసాగింపుగా క్రాక్ 2 రాబోతుంది అనే వార్తలు బయటకు రావడంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకరత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. అన్ని కుదిరితే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించబోయే సినిమా పూర్తి అయిన తర్వాత రవితేజ , గోపీచంద్ మలినేని కాంబోలో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: