( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

` హిట్ ` యూనివ‌ర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్ట‌ర్ శైలేష్ కొలను. హిట్ ఫ‌స్ట్ కేస్‌, సెకండ్ కేస్ మ‌రియు రీసెంట్ గా వ‌చ్చిన థర్డ్ కేస్ మూడు చిత్రాలు విజ‌యం సాధించాయి. హిట్ 3 ఎండింగ్ లో త‌మిళ స్టార్ హీరో కార్తిని చూపించి ` హిట్ 4 ` ను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్ప‌ట్లో హిట్ 4 లేన‌ట్లే అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు కార‌ణం.. డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెళ్లిపోవ‌డ‌మే. తాజాగా ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు.


హిట్ 3 స‌క్సెస్ నేప‌థ్యంలో మీడియాలో ముచ్చ‌టించిన శైలేష్ కొల‌ను.. త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్‌ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ` కుటంబంతో క‌లిసి నేను ఒక ఆరు నెలలు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. కాస్త వెకేషన్ తీసుకొని మ‌ళ్లీ కొత్త స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేస్తాను. నెక్స్ట్ ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాను. అలాగే విక్ట‌రీ వెంకటేష్ గారికి ఒక సినిమాతో హిట్ ఇవ్వాలి. ` అని చెప్పుకొచ్చారు.


` హిట్ 4 ` గురించి కూడా శైలేష్ కొలను మాట్లాడారు. ` హిట్ 4 కథాంశంపై ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. కానీ నాకు కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. పూర్తి స్క్రిప్ట్‌ అభివృద్ధి చేయాల్సి ఉంది. హిట్ 4 ఇప్పట్లో ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ హిట్ 7 వరకు సినిమాలు ఉంటాయి ` అని శైలేష్ కొలను తెలిపారు. ఈయన వ్యాఖ్య‌ల‌తో హిట్ 4 ఇప్ప‌ట్లో రాద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. కాగా, హీరో కార్తి లైన‌ప్ లో మూడు, నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇవి ఫినిష్ కావ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కాబ‌ట్టి హిట్ 4 క‌న్నా ముందే శైలేష్ ఒకటి లేదా రెండు వేరే సినిమాలు తీసే అవ‌కాశం ఉంది.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: