
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సినిమా కథ ఉండబోతుందని ... సినిమాలో పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయని నేటి ప్రస్తుత రాజకీయ సమాజానికి తగినట్టుగా పూరి కథ రెడీ చేశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలను కీలక పాత్రలో నటిస్తోందని ... పైగా రాజకీయ నాయకురాలు పాత్రలో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. సహజంగా పూరి జగన్నాథ్ సినిమాలలో ఈ తరహా పాత్రలకు డెప్త్ ఎక్కువ ఉంటుంది.. మరి రాజకీయాలపై పూరి ఎలాంటి పాత్రలు రాశాడో ? చూడాల్సి ఉంది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన గత రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు.
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఈ రెండు సినిమాలు పూరి క్రేజీ ను పాతాళంలోకి తొక్కిపడేసాయి. పూరి గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలలో బలమైన కంటెంట్ మిస్సయింది. ఈ నేపథ్యంలో పూరి విజయసేతుపతి కోసం బలమైన కథను రాసాడని ప్రచారం జరుగుతోంది. ఇక విద్యాబాలన్ బాలయ్య బయోపిక్ కథానాయకుడు - మహానాయకుడు సినిమాలలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈసారి పూరి సినిమాలో రాజకీయ నాయకురాలుగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు