
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు. గత ఐదు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. క్రిష్ జాగర్లమూడి - ఏఎం జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏఏం రత్నం దాదాపు 200 కోట్లకు పై చిలుకు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలు క్రమక్రమంగా పెంచేలా చేస్తున్నాయి. హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జనసేన పార్టీ అధినేత కావడంతో పాటు అటు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ను జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు కూటమి ప్రభుత్వ కీలక నాయకులు కూడా ఒక పెద్ద పండగలా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే తెలంగాణలో ఉదయం నాలుగు గంటల నుంచి ఈ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు అనుమతులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో ముందు రోజు రాత్రి 10 గంటల నుంచి హరిహర వీరమల్లు స్పెషల్ షోలు ప్రదర్శించునన్నారు. ఇందుకు అధికారికంగా కూడా అనుమతులు అవసరం లేదు. ఎలాగో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి .. దీనికి అనుమతులు అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా యేళ్లు కావడంతో అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు రోజు రాత్రి 10 గంటల నుంచే వీరమల్లు సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే అర్ధరాత్రి షో లతో పాటు సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి ఉదయం 4 గంటలకు 7 గంటలకు కూడా వీలుంటే ఎన్ని సార్లు అయినా వేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ రెడీ అవుతున్నారు ఇక ఈ సినిమా అర్ధరాత్రి షోలు చూసేందుకు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు .. ఇటు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రెడీ అవుతున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో హరిహర వీరమల్లు రిలీజ్ ను పెద్ద పండగల చేసుకుంటున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు