
ఇటీవలే సత్య శ్రీ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటర్వ్యూలో ఈ పాట విషయంపై జరిగిన ఇష్యూ గురించి మాట్లాడింది. సత్య శ్రీ మాట్లాడుతూ.. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రంలో ఈ పాట రిలీజ్ అయిన తర్వాత పోలీసుల నుంచి తనకి వార్నింగ్ లాంటి కాల్స్ వచ్చిందని తెలిపింది. ఒకరోజు నేను పడుకునేటప్పుడు ఒక లేడీ పోలీస్ కాల్ చేసి అసలు ఆ సాంగ్ కి ఎలా డాన్స్ వేస్తారు..మా డ్రెస్ వేసుకొని అలా చేయడానికి సిగ్గుండాలి అంటూ తిట్టిందట. ఈ విషయంపై తనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం తాను ఒక ఆర్టిస్టును మాత్రమే అని చెప్పిన వినలేదని తెలిపింది సత్యశ్రీ.
కేవలం డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎలా చెప్తే అలా చేస్తామని వాళ్ళను అడగండి అంటూ చెప్పిన కూడా వినలేదని తెలిపింది. అలా చాలా కాల్స్ పోలీసుల నుంచే వచ్చాయని ఫోన్ చేసి తిట్టేవారని.. ఈ విషయాన్ని చిత్ర బృందానికి చెప్పగా వాళ్ళు వదిలేసే మేము చూసుకుంటాం అంటూ చెప్పారని తెలిపింది సత్యశ్రీ. అయితే మొదట ఆ పాట చెయ్యనని చాలా వల్గర్ గా ఉంటుందని చెప్పాను కానీ శేఖర్ మాస్టర్, నితిన్, డైరెక్టర్ ఒక్కంతం వంశీ ఉన్నప్పటికీ వాళ్లు మొదట తనకు ఆ పాట గురించి చెప్పలేదు. సినిమా కమిట్ అయ్యాను కాబట్టి డబ్బులు తీసుకున్నాను కాబట్టి చేయాల్సిన పరిస్థితి ఎదురయ్యిందంటూ తెలిపారు. శేఖర్ మాస్టర్ ని కూడా అడగగా తాను వల్గర్గ డాన్స్ చేయించనని చెప్పారట..అయితే ఈ పాటను తన ఇంట్లో కూడా చెప్పిన తన తండ్రి ఈ పాట షూటింగ్ చేసేటప్పుడు వచ్చారు. తన తండ్రి కూడా డాన్సులో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతోనే ధైర్యంగా చేశానని తెలిపింది సత్య శ్రీ. తనకు అవకాశాలు రావడంలో ఈ పాట ప్లస్ అయిందని కూడా వెల్లడించింది.