
టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతికి సినిమాలు ముందే ఖర్చీఫ్ వేశాయి. మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా , నవీన్ పోలిశెట్టి సినిమా , అలాగే రవితేజ - తిరుమల కిషోర్ ఈ మూడు సినిమాలు సంక్రాంతిని ఎంచుకున్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్ చకచకా జరుగుతోంది. ఇక ఈ మూడు సినిమా లలో ఒకటి నెట్‌ఫ్లిక్స్ సినిమా. మిగిలిన రెండు డిస్కషన్ లో నడుస్తున్నాయి.. ఆ రెండు సినిమాలు కూడా నేడో రేపో ఫైనల్ అయిపోతాయి. అంటే కీలకమైన మూడు ఓటిటి సంస్థలు తమ సినిమాలు జనవరికి ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఏ సినిమా వచ్చినా అది చిన్న సినిమా అయి ఉండాలి. ఎందుకంటే మిగిలిన ఓటీటీ లలో సర్దుకోవటానికి ..!
ఇలాంటి నేపథ్యంలో నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనే గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. అఖండ 2 సినిమాను ముందుగా దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్ నిర్మాణాంతర పనులు కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉండడంతో దసరాకు కాస్త అటు ఇటుగా అయితే ఏదైనా మంచి డేట్ చూసి వేసే అవకాశం ఉంది. లేదు అంటే సంక్రాంతికి రావాలి. ఒకవేళ సంక్రాంతి బరులు కి వస్తే పోటీ చాలా రంజుగా ఉంటుంది. సీనియర్ హీరోలు చిరంజీవి - బాలయ్య - రవితేజ ముగ్గురు సంక్రాంతి రేసులో ఢీ అంటే ఢీ అంటారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు