
అంతేకాదు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు ఆయన కీలక విషయాలు వెల్లడించారు అంటూ కూడా ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు మొత్తం ట్యాప్ చేయించినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించినట్లు సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల లిస్టులో కొంతమంది రియల్ ఎస్టేట్ ప్రముఖులు అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా సినీ స్టార్స్ కి సంబంధించిన ఏడుగురు పేర్లు ప్రముఖంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటపడ్డాయి .
తాజాగా సోషల్ మీడియాలో మరొక రూమర్ వైరల్ గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కూడా ఈ బాధితుల లిస్ట్ లో ఉంది అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . నరేష్ భార్య పవిత్ర లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేయించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియడం లేదు. అసలు పవిత్ర లోకేష్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయించారు..?? అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ మొదలైంది .
ఆమె పొలిటీషియన్ కాదు కదా..? ఆమెకు సంబంధించిన ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు ..??అంటూ నెటిజన్లు ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . కొందరు ఆమె ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ఫోన్ ట్యాపింగ్ విషయాన్నీ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు . ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పవిత్ర లోకేష్ ఫోన్ ట్యాప్ అయ్యింది అన్న న్యూస్ ని బాగా వైరల్ చేస్తున్నారు .
కొంతమంది మధ్యలోకి నరేష్ ని కూడా లాగుతూ ఘాటుగా మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు . పవిత్ర సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు అని కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు . రోజు రోజుకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ముదిరిపోతుంది . గతంలో నరేష్ - పవిత్ర లోకేష్ ముద్దు ఫోటో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైరల్ అవుతుంది. అసలు ఆమె ఫోన్ ఎందుకు ట్యాప్ చేయించారు..? నిజంగానే ట్యాప్ చేయించారా..? లేక కేవలం ఇది ఒక రూమర్ మాత్రమేనా..? అని జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆమె ఫోన్ ట్యాప్ అయ్యిందో లేదో తెలియదు కానీ పవిత్ర మాత్రం మరొకసారి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది..!!