
మరొకసారి ఈ చర్చను తెరపైకి తీసుకొచ్చాడు తమ్మారెడ్డి భరద్వాజ . ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . అందరికీ తెలిసిన వ్యక్తి . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇప్పుడు సినిమాలు తీయనప్పటికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్నారు . తన ఒపీనియన్ ని ఓపెన్ గా చెప్పే తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత ఇండస్ట్రీలోని పరిస్థితులపై స్పందించారు.
ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖుల కలవడం టాలీవుడ్ లో వరుస పరాజయాలు వంటి అంశాలపై ఓపెన్గా రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్ కి కొంత మంది రాలేదు అన్న విషయం పై కూడా ఆయన రియాక్ట్ అయ్యి స్పందించారు . కాగా టాలీవుడ్ సినీ పెద్దలు ఎందుకు ముఖ్యమంత్రిని కలవాలి అన్నదానిపై ఆయన చాలా బోల్డ్ గా స్పందించారు . "అప్పట్లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిలు సీఎంగా ఉన్నప్పుడు .. మా తరంలో అసలు ఎవరు కలవలేదు.. అలాంటి సందర్భాలు కూడా రాలేదు . ఆ తర్వాత నలుగురు ఐదుగురు పెద్దలు వెళ్లి చంద్రబాబును కలిశారు. అది వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం ఏదో పదవులు ఇంకేదో పర్సనల్ హెల్ప్ కోసం మాత్రమే .. సినిమాల కోసం తక్కువ మందే అలా కలుస్తారు . టికెట్లు రేట్లు పెంచుకోవడానికి మరి కొంత మంది వెళ్లారు .
మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు కలవడం అప్పట్లో కాంట్రివర్షియల్ అయింది. వాళ్ళు వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్లారు తప్పిస్తే సినిమాల కోసం కాదు . రెండోసారి చిరంజీవి ఆధ్వర్యంలో కొంతమంది వెళ్లారు . అంతే ఇప్పుడు చంద్రబాబును ఎందుకు కలవడం లేదు..? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడా..? అని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవడు భయపడ్డాడు..? ఎందుకు భయపడతారు..? జగన్ ని కానీ, చంద్రబాబు నాయుడుని కానీ ..పవన్ కళ్యాణ్ ని కానీ ..రాజశేఖర్ రెడ్డి ని కానీ ..ఎవరైనా ఎందుకు భయపడతారు..? భయపడాల్సిన అవసరం అసలు ఏముంది..? సినిమా వాళ్లది గోరంత వ్యాపారం . తెలుగు రెండు రాష్ట్రాల బడ్జెట్ లక్ష కోట్లకు పైగానే ఉంటుంది . 3000 కోట్ల వ్యాపారం జరిగితే రెండు రాష్ట్రాలకు కలిపి సుమారు 200 కోట్లు టాక్స్ లు కడుతున్నాం . వ్యక్తిగతంగా మర్యాద ఉంటే అవసరం ఉంటే ఎవరినైనా సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసి కలిస్తే కలవచ్చు" అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు . దీనితో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!