సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు చాలామంది డ్రగ్స్ తీసుకుంటారని,బాడీ అట్రాక్టివ్ గా కనిపించడం కోసం స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటారనే రూమర్లు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. అలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అమరన్ మూవీ హీరో శివ కార్తికేయన్ స్టెరాయిడ్స్ తీసుకున్నారని, అందుకే ఆరోగ్యం పాడైంది అంటూ తన తాజా మూవీ మదరాసి ప్రమోషన్స్ లో బయటపెట్టారు. మరి నిజంగానే శివ కార్తికేయన్ స్టెరాయిడ్స్ తీసుకున్నారా.. అందుకే ఆయన 8 ప్యాక్ బాడీ కనిపించిందా అనేది ఇప్పుడు చూద్దాం.. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో శివ కార్తికేయన్ హీరోగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మదరాసి అనే మూవీ తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.

మూవీ మరికొద్ది గంటల్లో అనగా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్. అయితే ఆ ఇంటర్వ్యూలో సంచలన విషయం బయట పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ మీ మీద వచ్చిన ఒక రూమర్ లేదా ఫేక్ థంబ్ నెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడగగా.. అవును ఉన్నాయ్..నేను స్టెరాయిడ్స్ తీసుకొని ఆరోగ్యం నాశనం చేసుకున్నానంటూ రాశారు.అయితే అమరన్ మూవీ విడుదలైన టైంలో 8 ప్యాక్ బాడీ తో నన్ను చూపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నా మెడ మొత్తం సాగిపోయినట్టు బాడీ మొత్తం పాడైనట్లు చూపించి 8 ప్యాక్ బాడీ కోసం శివ కార్తికేయన్ స్టెరాయిడ్స్ తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకున్నారు అంటూ ఫేక్ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేశారు.

అయితే ఈ న్యూస్ చూడగానే నేను అయ్యో పాపం అనుకున్నా.. ఇది నా కెరీర్లో వినిపించిన ఫేక్ రూమర్ అంటూ శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. ఇక రుక్మిణి వసంత్ ఈ ఫేక్ థంబ్ నెయిల్ గురించి మాట్లాడుతూ.. మనం సినిమాలో ఏదైనా ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కన్నీళ్లు పెట్టుకునే ఫొటోస్,వీడియోస్ ఉంటాయి. వాటికి స్యాడ్ ఎమోజీలు పెట్టి రుక్మిణి వసంత్ ఏడుస్తుంది అన్నట్లుగా ఫేక్ ఫోటోలు క్రియేట్ చేస్తారు. ఇక షూటింగ్స్ లో ఎప్పుడైనా పొరపాటున కళ్ళు తుడుచుకుంటే చాలు రుక్మిణి వసంత్ తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల కన్నీళ్లు పెట్టుకుంటుంది లైవ్ లోనే అంటూ రాసుకొస్తారు అని చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి ఫేక్ రూమర్స్ థంబ్ నెయిల్స్ అనేవి ప్రతి ఒక్క సెలబ్రిటీ లైఫ్ లో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: