
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు, సిద్ధు ఇంటర్వెల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ..“ప్రతి సినిమాకీ సెకండ్ హాఫ్‌లో కొంచెం డిప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా స్టార్ట్ అయి, ఇంటర్వెల్ టైంకి బాగా పిక్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే ఆ మోమెంటం మిస్ అవుతుంది. అందుకే కొన్ని సినిమాలు ఇంటర్వెల్ తర్వాత కాస్త సద్దుమణిగిపోతాయి. కానీ హాలీవుడ్ సినిమాల్లో ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ ఉండదు. అవి నిరంతరంగా కథను నడిపిస్తాయి. మన దగ్గర మాత్రం ఇంటర్వెల్ సమయంలో అందరూ పాప్కార్న్ కోసం లేచి వెళ్తారు, ఆ ఫ్లో బ్రేక్ అవుతుంది. అదే సెకండ్ హాఫ్‌కు ప్రభావం చూపిస్తుంది. హాలీవుడ్ లో అలా ఉండదు" అని చాలా క్యాజువల్ గా చెప్పుకొచ్చ్చారు. ”ఈ కామెంట్‌లోని “పాప్ కార్న్ పంచాయితీ” అనే పదాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ ప్రారంభించారు. “ఇంత తక్కువగా మన ప్రేక్షకుల్ని మాట్లాడాలా?”, “సినిమా హిట్ కావాలంటే పాప్ కార్న్ వల్ల కాదు, కంటెంట్ వల్ల” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.
మరికొందరు మాత్రం సిద్ధు చెప్పిన మాటల్లో తప్పేం లేదని సపోర్ట్ చేస్తున్నారు. “అతడు చెప్పింది ఫ్యాక్ట్. ” అని చెబుతున్నారు. అయితే మరికొందరు ఆయనపై సాఫ్ట్‌గా రియాక్ట్ అవుతూ, “ఆ పాప్ కార్న్ మాట మాట్లాడకపోయుంటే బాగుండేది. అంతే తప్ప ఆయన ఉద్దేశం చెడు కాదు” అని కామెంట్ చేస్తున్నారు. ఇక మొత్తానికి చెప్పాలంటే, సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన ఒక మాట ఇప్పుడు నెట్టింట పెద్ద సెన్సేషన్‌గా మారింది. సినిమాలో ఉన్న భావోద్వేగాల కన్నా ఆయన నోటి నుండి వచ్చిన ‘పాప్ కార్న్’ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.