మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వెంకటేష్సినిమా షూటింగ్లో కూడా జాయిన్ అయ్యాడు. ఆ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఓ సెంటిమెంట్ గనుక వర్కౌట్ అయితే మన శంకర వర ప్రసాద్ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇంతకు ఆ సెంటిమెంట్ ఏమిటి అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి , బాబి దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి రవితేజ అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ మూవీ లో రవితేజ కీలకమైన పాత్రలో నటించడం , ఆ సినిమా సంక్రాంతికి విడుదల కావడం , ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మన శంకర వర ప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తూ ఉండడం , ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుండడంతో వాల్టేరు వీరయ్య సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లయితే మన శంకర వర ప్రసాద్ సినిమాతో కూడా చిరంజీవి కి అద్భుతమైన విజయం దక్కుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: