నేచుర‌ల్ స్టార్ మ‌రోసారి త‌న నేచురాలిటీ ఫ్రూవ్ చేసుకున్నాడు. నాని న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రీమియ‌ర్ల నుంచే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా టైటిల్‌కు అంద‌రూ న్యాయం చేశారు. స‌హ‌జంగా మ‌న తెలుగు సినిమాల్లో హీరోయిజం బాగా ఎక్కువుగా ఉంటోంది.


ఇటీవ‌ల హీరోయిజం మామూలుగా చూపెట్ట‌డం లేదు. హీరో వ‌చ్చాడంటే ప‌ట్టుకుని న‌లుగురిని చిత‌క్కొట్టేయ‌డాలు. ఫైట్లు, కార్లు, చేజింగులు, భారీ భారీ డైలాగులు, ఎవ‌డు ఎవ‌డిని ఎందుకు కొడుతున్నాడో తెలియ‌కుండా క‌థ‌ను న‌డిపించేస్తున్నారు. క‌థ‌లో హీరోదే డామినేష‌న్‌, మిగిలిన వాళ్లు ఎందుకు ఉంటున్నారో కూడా తెలియ‌దు. కానీ గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో కేవ‌లం నానీయే కాదు.. మిగిలిన వారు అంద‌రూ క‌లిసి గ్యాంగ్ అన్న‌ట్టుగా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ క‌థ‌కు క‌రెక్టుగా న్యాయం చేశారు.


ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రూ ఆల్రెడీ ఆర్టిస్టులుగా నిరూపించుకున్న‌వాళ్లే. ఎవ‌రి పాత్ర‌ల్లో వాళ్లు స‌రిగ్గా స‌రిపోయారు. రైట‌ర్ పెన్సిల్ పార్థ‌సార‌థిగా నాని, అత‌ని ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి, బామ్మ‌గా ల‌క్ష్మి, కొడుకును పోగొట్టుకున్న అమ్మ‌గా శ‌ర‌ణ్య‌, కాబోయేవాడిని పోగొట్టుకున్న వ్య‌క్తి ప్రియాంక‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సినిమా ప్రారంభంలో చూపించే స‌న్నివేశాలు బాగున్నాయి.


ఇక నాని నటనకు వంక పెట్టడానికి లేదు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. విలన్‌గా కార్తికేయ మెప్పించాడు. ఇలా ప్ర‌తి ఒక్క‌రి పాత్ర‌ల‌కు మంచి ప్రాధాన్యం ఉంది. సినిమా అంటే మ‌న రొటీన్ తెలుగు ఫార్ములాకు భిన్నంగా సినిమా అంతా అన్న కాన్సెఫ్ట్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరును మెచ్చుకోవాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: