ఆ షాక్ నుంచి తేరుకోక ముందే... ఈ స్వీట్ అండ్ హాట్ యాంకర్ ఇంకో షాక్ ఇచ్చింది. పవన్ సినిమాకే కాదు.. ఈ అమ్మడిని బన్నీ సినిమాకీ అడిగారట. రేసుగుర్రంలో ఓ పాత్ర కోసం అనసూయను సంప్రదించారట. దానికీ నో అనేసిందట. కారణం ఏమిటీ..? అని అడిగితే ''రేసుగుర్రం కోసం ఆగస్టు నుంచి నా కాల్షీట్లు అడిగారు.
సరిగ్గా అదే సమయంలో మా ఇంట్లో ఓ శుభకార్యం ఉంది. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు.. అందుకే ఈ ఆఫర్ కూడా వదులుకొన్నా..'' అంటోంది. అమ్మో... ఇలాంటి ఆఫర్లు ఎవరికైనా వస్తాయా? వస్తే వదులుకొంటారా? అనసూయ మాత్రం ఇలా ఎందుకు చేస్తుందో ఏమో..?