కరోనా వైరస్.. ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటి 47 లక్షల మందికిపైగా కరోనా వైరస్ సోకగా అందులో 88 లక్షలమంది కరోనా నుండి కోలుకున్నారు. 6 లక్షలమందికిపైగా ఈ కరోనాకు బలయ్యారు. 

 

IHG

 

మన భారత్ లో కరోనా విజృంభణ దారుణంగా ఉంది. కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అలాగే ఉంది. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆస్పత్రి వరకు వెళ్ళకుండా వైద్యుల సూచనల మేరకు ఎంతోమంది ప్రజలు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తున్నప్పటికీ వీటికి కూడా దూరంగా ఉండాలి.  

 

IHG't Let You Forward A Message More Than Once

 

స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలి. ఇలా చెప్పిన ఈ కాలంలో ఎవరు దూరంగా ఉండరు అన్న సంగతి తెలిసిందే. అందుకే స్మార్ట్ ఫోన్ లోని కొన్ని యాప్స్ ను తొలిగించాలి. అందులో మొదటిది వాట్సాప్. ఎందుకంటే? సాధారణంగానే తప్పుడు సమాచారం ఇందులో తెగ షేర్ చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ట్రేండింగ్ టాపిక్ కాబట్టి కరోనాకు సంబంధించిన ఫేక్ న్యూస్ లు దారుణంగా షేర్ చేస్తున్నారు. 

 

IHG

 

ఈ న్యూస్ లు ఎలా ఉంటాయి అంటే? సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా భయపడే విధంగా ఆ ఫేక్ న్యూస్ లు ఉంటాయి. అందుకే వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్స్ కు దూరంగా ఉండాలి. ఒక్క సోషల్ మీడియాకే కాదు వార్తలకు కూడా దూరం ఉండడం మంచిది. హోమ్ ఐసొలేషన్, క్వారంటైన్ ఉన్న సమయంలో న్యూస్ పేపర్ కు, సోషల్ మీడియాకు, న్యూస్ ఛానెల్స్ కు దూరంగా ఉండండి. 

 

IHG

 

ఆ సమయంలో కామెడీ సినిమాలు, కామెడీ సీన్స్ చూస్తూ సమయానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకొని వైద్యులు ఇచ్చిన సలహాలను పాటిస్తే కరోనాను తరిమికొట్టగలరు. మన భయమే మనల్ని దెబ్బ తీస్తుందని అందుకే కరోనా అంటూ భయపెట్టి వాట్సాప్ వార్తలకు, ఫేక్ న్యూస్ లకు దూరంగా ఉండడం మంచిదని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: