ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్రీకరిస్తూ ఏపీ కి మూడు రాజధానులు వ‌స్తున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక తాజాగా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన చేశారు. ఆ వెంటనే జగన్ సైతం మూడు రాజధానులు ఉపసంహరించుకుంటామని ఆ బిల్లు లో ఉన్న తప్పులను సరి చేసి మళ్ళీ కొత్త బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో జగన్ చేసిన తప్పును ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టంగా చెప్పారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గా అయిపోయే విషయాన్ని... పెద్ద సమస్యగా తనంతట తానే మార్చుకున్నారని నాగేశ్వరరావు చెప్పారు. జగన్ మూడు రాజధానులు అన‌కుండా పరిపాలన సౌలభ్యం కోసం తాను వైజాగ్లో కూర్చుంటానని జగన్ చెప్తే ఎవరైనా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. అలాగే పరిపాలన అంతా ఒక రాజధానిలోనే ఉండాలని మన రాజ్యాంగంలో ఎక్కడా లేదని... అలాగే వివిధ శాఖ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతి లోనే ఉండాలని చట్టం చెప్పలేదని నాగేశ్వర్ తెలిపారు.

జగన్ తాను ముందునుంచి అనుకున్నట్టుగా వైజాగ్ - కర్నూలుకు కొన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర ప్రధాన కార్యాలయాలను త‌ర‌లించి ఉంటే సరిపోయేది అని నాగేశ్వ‌ర్‌ చెప్పారు. నాగేశ్వ‌ర్ చెప్పిన లాజిక్ లో కూడా కొంత అర్థం ఉంది. జ‌గ‌న్ రెండే ళ్ల నుంచి అదిగో విశాఖ‌లో రాజ‌ధాని.. ఇదిగో విశాఖ లో రాజ‌ధాని అని చెపుతున్నా రు కాని... ఈ శాఖ‌ల కార్యాల‌యాల‌ను మాత్రం అక్క‌డ‌కు త‌ర‌లించ‌డం లేదు.

ఏదేమైనా జగన్ రాజకీయ పార్టీల అభ్యంతరాలు పట్టించుకోకుండా న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: