కొత్త ఏడాదిలో రెండు షాకులు త‌గిలాయి.ఒక‌టి ఆర్ఆర్ఆర్ వాయిదా,ఇంకొక‌టి వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు త‌న పొలిటిక‌ల్ కెరియర్లో ఎన్న‌డూ తీసుకోని నిర్ణ‌యం ఒక‌టి తీసుకోవ‌డం..తాను పార్ల‌మెంట్ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్ప‌డం.ఈ రెండూ ఈ వారంలో ఆంధ్రావ‌నిలో చ‌ర్చ‌కు తావిచ్చాయి.రాజ‌మౌళి సినిమా రానందుకు నిరాశ‌లో అటు తార‌క్, ఇటు చ‌ర‌ణ్ అభిమానులు ఉండిపోయారు.దీంతో కొన్ని జోకులు కూడా పేలాయి.తాము ఆర్ఆర్ఆర్-ను ఎప్పుడో చూశామ‌ని,సినిమా సూప‌ర్ డూప‌ర్ బంప‌ర్ హిట్ అని కొంద‌రు ట్రోల్ చేశారు కూడా! 


ఇవ‌న్నీ అటుంచితే నిర్మాత‌ను కాపాడేందుకు రాజ‌మౌళి ఓ రిస్కు తీసుకున్నాడ‌ని కూడా తెలిసింది. నిర్మాత‌ల అప్పుల‌కు తానే హామీగా ఉంటూ, ఓ పెద్ద సాహ‌సం చేశాడ‌ని టాక్..దీంతో దాన‌య్య‌కు కాస్త టెన్ష‌న్ త‌గ్గింది. సినిమాను వ్యూహం ప్ర‌కార‌మే వాయిదా వేశాడ‌ని కొంద‌రు అంటున్నారు కూడా! ఏదేమ‌యినా ఓ స‌స్పెన్స్ పాయింట్ ను క్యాష్ చేసుకోవ‌డం గ‌తంలో బాహుబ‌లి విష‌య‌మై జ‌రిగింది. ఇప్పుడూ అదే జ‌ర‌గ‌నుంది. క‌నుక రాజ‌మౌళి అప్పు తీర్చే బాధ్య‌త మాత్రం ఆంధ్రుల‌దే! ఆ మాట‌కు వ‌స్తే ఇరు రాష్ట్రాల వారిది! ఇంత‌కూ అప్పు ఎంత‌నుకుంటున్నారు అక్ష‌రాల రెండు వంద‌ల కోట్లు.



మరో ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. వైసీపీ రెబ‌ల్ ఎంపీ  ర‌ఘురామ కృష్ణం రాజు న‌ర‌సాపురం నుంచి మ‌రో సారి పోటీచేస్తాన‌ని, అందుకు త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని, ద‌మ్ముంటే పోటీ చేసి గెల‌వాల‌ని ప్రియ స్నేహితుడు జ‌గ‌న్ కు స‌వాలు విసిరారు.. ఇది కూడా ఈ వారం ట్రోల్ అయిన స‌బ్జెక్టే ! య‌థాలాపంగా కొత్త పీఆర్సీపై కూడా ఆర్ఆర్ఆర్ మండిపడ్డారు. అంతేకాదు తాను గెల‌వ‌క‌పోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ కూడా చేశారు..త‌న ఎన్నిక వైసీపీ పాల‌న‌కో రెఫ‌రెండం అని కూడా చెప్పారు.వీటిపై వైసీపీ కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించింది. ఉప ఎన్నికకు తాము సిద్ధ‌మేన‌ని అంటోంది. అదేవిధంగా ర‌ఘు రామ‌ను త‌ప్ప‌కుండా  ఓడించి తీరుతామ‌నే చెబుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగేందుకు సిద్ధం అవుతోంది.ఇప్ప‌టికే కోర్టు గుమ్మంలో జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న ఆయ‌న ఇక‌పై సంబంధిత న్యాయ ప్ర‌క్రియ‌ను కూడా
వేగ‌వంతం చేయాల‌ని ఈ వార‌మే నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: