వైసీపీలో పూర్తిగా రెడ్డి నేతల డామినేషన్ ఎక్కువ ఉంటుందనే సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు....అసలు వైసీపీ అంటేనే రెడ్డి పార్టీ అన్నట్లు ఉంటుంది. పైగా ఆ పార్టీని నిలబెట్టేది కూడా రెడ్డి వర్గం నేతలే. పార్టీ గెలుపులో వారే కీలకపాత్ర పోషిస్తుంటారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో రెడ్డి నేతల వల్లే వైసీపీకి భారీగా సీట్లు వస్తుంటాయి. ఆ జిల్లాల్లో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువనే సంగతి తెలిసిందే.

అయితే ఇలా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు వల్ల వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. వైసీపీని వీక్ చేయాలంటే..రెడ్డి నేతలని వీక్ చేయాలి. అప్పుడే టీడీపీకి బెనిఫిట్ అవుతుంది. అందుకే చంద్రబాబు సైతం చాలాచోట్ల రెడ్డి ఎమ్మెల్యేలకు ధీటుగా టీడీపీలో కూడా రెడ్డి నేతలని పెట్టారు. ఇక టీడీపీలో ఉన్న రెడ్డి నేతల్లో కొందరు బాగానే పనిచేస్తున్నారు. వైసీపీకి ధీటుగానే వారు ముందుకెళుతున్నారు. అలా వైసీపీకి ధీటుగా పనిచేసే రెడ్డి నేతల గురించి మాట్లాడుకుంటే...మొదట నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురించే మాట్లాడాలి. పీలేరులో ఆయన బాగా పికప్ అయ్యారు.

పీలేరులో వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి ధీటుగా నల్లారి వచ్చారు. నెక్స్ట్ ఎన్నికల్లో చింతలకు నల్లారి చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ సారైనా చెక్ పెట్టాలనే కసితో reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. వరుసగా ఓడిపోతూ వస్తున్న సోమిరెడ్డి...ఈ సారి గెలవాలని కష్టపడుతున్నారు. అలాగే తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని డామినేట్ చేసేలా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదిగారు. ఎలాగో తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీని గెలిపించారు. అలాగే పుట్టపర్తిలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ధీటుగా పల్లె రఘునాథ్ రెడ్డి ఎదిగారు. ఇక బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి పోటీగా బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డికి పోటీగా తిక్కారెడ్డిలు పికప్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: