రాజకీయాల్లో నేతల వారసుల ఎంట్రీలు ఇవ్వడం ఎప్పుడూ జరిగే ప్రక్రియే...అయితే ఎంతమంది వారసులు వచ్చిన వారు రాజకీయంగా నిలబడటమే పెద్ద విషయం. అందరికీ రాజకీయంగా సక్సెస్ రావడం అనేది జరగదు. ఏదో కొంతమంది వారసులే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు...కానీ రాజకీయంగా సక్సెస్ సాధించలేకపోయారు. అయితే మళ్ళీ కొందరు వారసులు రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

టీడీపీ నుంచి చాలామంది వారసులు రెండోసారైనా సక్సెస్ కావాలని చూస్తున్నారు. అయితే కొందరు టీడీపీ నేతల వారసుల భవిష్యత్..జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతుల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ వారసులు రంగంలోకి దిగిన నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి కారణమైంది. ఇక ఈ సారి మాత్రం జనసేన, టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే గాని జరిగితే కొందరు వారసులు రాజకీయంగా సక్సెస్ అవుతారు.


అలా సక్సెస్ అయ్యే వారిలో దివంగత బాలయోగి తనయుడు హరీష్ కూడా ఉంటారు. బాలయోగి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన హరీష్...గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే అమలాపురం నుంచి బాలయోగి పలుమార్లు ఎంపీగా గెలిచి లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఇదే స్థానంలో ఆయన వారసుడు మాత్రం రాజకీయంగా ఫెయిల్ అయ్యారు. కేవలం 40 వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.

ఇక అమలాపురం పార్లమెంట్‌లో జనసేనకు పడిన ఓట్లు రెండులక్షల 54 వేల ఓట్లు..అంటే ఏ స్థాయిలో జనసేన ఓట్లు చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడే జనసేన కలిసి ఉంటే బాలయోగి వారసుడు గెలిచేవాడు. అయితే ఈ సారి పవన్ కల్యాణ్ సపోర్ట్ చేస్తేనే బాలయోగి తనయుడు గెలవగలరు...లేదంటే మళ్ళీ ఇబ్బంది పడక తప్పదు. మొత్తానికి చూసుకుంటే బాలయోగి వారసుడు భవిష్యత్ పవన్ కల్యాణ్ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: