ఎస్ ప్రెసెంట్ అందరు ఇదే వార్త గురించి మాట్లాడుకుంటున్నారు . బాలయ్య ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నారా ..? అంటూ చర్చించుకుంటున్నారు . దానికి కారణం సోమవారం నాడు రాష్ట్రపతి భవన్ లో ఆయన ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగడమే . మనకు తెలిసిందే.. రిపబ్లిక్ డే సందర్భంగా నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ప్రభుత్వం.  కాగా సోమవారం నాడు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డులు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలయ్య రాష్ట్ర ప్రతి ద్రౌపది ముర్ము చేతల మీదగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.


ఈ కార్యక్రమానికి బాలయ్య టోటల్ ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా హాజరు కావడం విశేషం . అక్కడే ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగారు . అయితే ఆ ఫ్యామిలీ ఫోటో చూసి అందరూ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి ఈ విధంగా ఉండాలి అంటూ పొగిడేస్తున్నారు . కానీ కొంతమంది మాత్రం బాలయ్య చిన్న కూతురు తేజస్విని పై సపరేట్ అటెన్షన్ ఫోకస్ చేశారు.  తేజస్విని వైట్ శారీలో చాలా అందంగా కనిపించింది.  అయితే తేజస్విని చీరలో కొంచెం బొద్దుగా కనిపించడం.. పైగా కడుపు కొంచెం ముందుకు వచ్చినట్లు ఉండడం తో ఆమె ప్రెగ్నెంట్ అని ఆమె బేబీ బంప్ ఈజీగా తెలిసిపోతుంది .



దీంతో నందమూరి ఫ్యామిలీ ఆ విషయాన్ని దాచుతుంది అని త్వరలోనే బాలయ్య ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే బాలయ్య ఫ్యామిలీ ఎప్పుడు అలా చేయదు . నిజంగా తేజస్విని ప్రెగ్నెంట్ అయితే ఆ విషయాన్ని ఎప్పుడో బయట పెట్టేస్తుంది . అది కేవలం ఆమె చీర కట్టే విధానంలో ఉన్న తప్పే.. ఆమె పొట్ట ఎత్తుగా కనిపించినంత మాత్రాన ప్రెగ్నెంట్ అయిపోతుందా..? అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆ కామెంట్స్ కి కౌంటర్స్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో తేజస్విని ప్రెగ్నెంట్ అన్న వార్త బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: