జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పవన్ తాజాగా మాట్లాడుతూ మతం ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడటం సరి కాదని అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని పవన్ చెప్పుకొచ్చారు. మత ప్రాతిపదికన చంపడం నా దృష్టిలో సరి కాదని ఆయన చెప్పుకొచ్చారు.
 
జమ్మూ కశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ నివాళుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింస గురించి అందరు ఒకే విధంగా స్పందించాలని కామెంట్లు చేశారు. కశ్మీర్ భారత్ లో భాగమని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని పవన్ పేర్కొన్నారు.
 
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధు సూధన్ రావు ఫ్యామిలీకి పవన్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడం కొసమెరుపు. ఉగ్ర ఘటనలో జనసేన ఒక కార్యకర్తను కోల్పోయిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. హిందువులకు ఉన్న దేశం మన దేశం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.
 
పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కు 2025 సంవత్సరం కెరీర్ పరంగా అన్ని విధాలుగా కలిసిరావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: