టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న న‌టులు చాలా తక్కువగా ఉంది ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒక‌రు. కుటుంబ కథల నేపథ్యంలో సినిమాలను నటిస్తూ  ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వెంకటేష్.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు .. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల తెర‌కెక్కిన‌ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ చేయగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. .
 

ఇక వెంకటేష్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు తెరకెక్కయి. కాగా గతంలో వెంకటేష్, సౌందర్యలది ఎంత పెద్ద బ్లాక్ బ‌స్టర్ హిట్ పెయిర్ ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, రాజా, పెళ్లి చేసుకుందాం లాంటి ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలు రూపొందాక‌యి. కాగా వీటిలో ఓ సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు వినూత్నమైన అనుభూతిని ఇవ్వడమే కాదు.. అన్ని భాషల ఆడియన్స్‌ను ఆకట్టుకుంది ..

 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అన్ని చోట్ల బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఆ మూవీ మరేదో కాదు పవిత్రబంధం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో.. వెంకీ క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం, సౌందర్య పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలా.. తెలుగుతోపాటు హిందీ, మలయాళ, బెంగాలీ, ఒరియా, తమిళ, కన్నడ భాషలో ఈ సినిమాను రీమేక్ చేశారు. ప్రతిభవంతులైన న‌టుల‌ పరిచయం, ఘ‌డమైన భగవద్వేగాలతో కుటుంబ విలువలు తెలిసిన సినిమాగా అన్ని భాషల ప్రేక్షకుల‌ ఆదరణ పొందిన పవిత్రబంధం.. ఇప్పటికీ టైంలెస్ క్లాసికల్‌గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: