- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన మోస్ట్ సాలిడ్ యాక్ష‌న్ అండ్ వ‌య‌ల్సెన్స్ క్రైం థ్రిల్ల‌ర్ హిట్ 3. ఈ సినిమా పై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా హిట్ 3. ఇక నాని సినిమా ల‌కు యూఎస్ మార్కెట్ లో ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. యూఎస్ మార్కెట్ లో నాని సినిమా ల‌కు ఎంత స్ట్రాంగ్ గా వసూళ్లు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది నాని కొత్త సినిమా హిట్ 3 విష‌యం లో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. హిట్ 3 సినిమా నార్త్ అమెరికా లో ఇప్పుడు రిలీజ్ కు రెండు రోజుల ముందే 3 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్క్ ని కేవ‌లం ప్రీ సేల్స్ ద్వారానే రాబ‌ట్టి దూసుకు వెళుతోంది. ఈ సినిమాసినిమా ప్రీమియ‌ర్స్ తో పాటు డే 1 కంప్లీట్ అయ్యే స‌రికి ఈ నెంబ‌ర్స్ ఏం రేంజ్ కు వెళ‌తాయా ?  ఎలా సెట్ చేస్తుంది ? అనేది వేచి చూడాలి.


ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ అందిస్తుండ గా నాని నిర్మాత గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఇక మే 1న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. నాని గ‌త సినిమా లు వ‌రుస పెట్టి సూప‌ర్ డూప‌ర్ హిట్లు అవుతున్నాయి. ఇక టాక్ తో సంబంధం లేకుండా యూఎస్ మార్కెట్లో మంచి వ‌సూళ్లు కొల్ల గొడుతున్నాయి. అందుకే హిట్ 3 పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: