ఏంటి అక్కినేని నాగచైతన్య నిజంగానే తండ్రి కాబోతున్నారా.. నాగచైతన్య శోభిత దూళిపాళ్ల తల్లిదండ్రులు కాబోతున్నారంటే అక్కినేని ఫ్యామిలీ తో పాటు అభిమానుల్లో కూడా చెప్పలేనంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ లో ఇప్పటి వరకు చిన్న పిల్లలు లేరు కాబట్టి పిల్లలు పుడితే అందరిలో ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల నుండి నాగ చైతన్య తండ్రి కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నప్పటికీ ఈ విషయం గురించి మాత్రం అక్కినేని ఫ్యామిలీ మాత్రం స్పందించడం లేదు. అయితే తాజాగా మళ్లీ నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల లు తల్లి కాబోతున్నారు అనే వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది. 

అయితే ఈ వార్తలు చాలా రోజుల నుండి చక్కర్లు కొట్టడంతో తాజాగా అక్కినేని టీం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని, ఒకవేళ నిజంగానే నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల లు తల్లిదండ్రులు కాబోతున్నారంటే కచ్చితంగా ఆ గుడ్ న్యూస్ ని ముందుగా మీతోనే షేర్ చేసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే శోభిత ధూళిపాళ్ల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నాకు పిల్లలంటే చాలా ఇష్టమని, తల్లి కావాలనే కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

 అయితే ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో అప్పటి నుండి ఇప్పటివరకు నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల ల ప్రెగ్నెన్సీ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా శోభిత దూళిపాళ్ల చీర లో ఉన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారిన సమయంలో ఆ చీరలో శోభిత దూళిపాళ్ల పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో అందరూ శోభిత ప్రెగ్నెంట్ అయిందని అనుకున్నారు. మరి చూడాలి ఈ కొత్త జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: