బాబోయ్.. కేజీ చికెన్‌ వెయ్యి రూపాయలా అని ఆశ్చర్యపోకండి. అది మన దగ్గరే కాదండి.. మన పొరుగునే ఉన్న శ్రీలంకలో.. అవును.. అక్కడ ధరలు మండిపోతున్నాయి. ఆ దేశంలో తలెత్తిన  ఆర్థిక సంక్షోభం ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఈ పరిస్థితికి కారణం అవుతున్నాయి. దీంతో నిత్యావసరాల ధరలు  ఆకాశన్నంటుతున్నాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లింది. శ్రీలంక చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి.


రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మనకు కూడా చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం శ్రీలంకలో కేజీ చికెన్ ధర 1000 రూపాయల వరకు పలుకుతోదంట.  కోడి గుడ్డు ఒక్కోటి 35 రూపాయలకు అమ్ముతున్నారట. కిలో ఉల్లిపాయలు 200నుంచి 250 రూపాయలుగా ఉందట. ఇక కేజీ పాల పొడి రేటెంతో తెలుసా.. అక్షరారా 1945 రూపాయలు.. అంటే ఇంచు మించు రెండు వేల రూపాయలన్నమాట. అలాగే కేజీ గోధుమ పిండి 200 పై అమ్ముతున్నారట. శ్రీలంకన్లు ఎక్కువగా వాడే లీటర్‌ కొబ్బరి నూనె ధర 900 రూపాయలు ఉంటోందట.


ఇలా ఒకటేమిటి.. చికెన్‌, బియ్యం, ఉల్లిపాయలు.. అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయట. గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగేసరికి దాదాపు అన్ని హోటళ్లు మూతపడ్డాయట. ఇక లీటర్ పెట్రోల్‌ 280 రూపాయలు ఉందట. లీటర్ డీజల్‌ 220 రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందిపడుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270 రూపాయలకు పడిపోయింది.


గతంలోనూ ఓసారి శ్రీలంకలో 1970లో ఇలాంటి ఆర్థిక సంక్షోభమే వచ్చిందట. కానీ ఇప్పటి సంక్షోభం దాన్ని మించిపోయేలా ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు పాలసీ కారణంగానే ఈ సంక్షోభం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు అదే కారణమని విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: