నిన్నా మొన్నటి వరకూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ “బొబ్బిలి పులి” గా పేరుగాంచి, తెలుగు సినిమా పరిశ్రమ కు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే దాసరి, అనుకోని పరిస్థితులలో నిన్న ఆయన సంస్థలపై సిబిఐ దాడి జరగడం తో బొగ్గుల స్కాం కు సంబంధించిన మసి ఆయనకు కూడా అంటడంతో, ఈరోజు చాలా పత్రికలలో, మీడియాలో “బొగ్గుల పులి” గా పతాక శీర్షికలతో వార్తలు రావడంతో దర్శకరత్న దాసరి ఈ వార్తలపై ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రతిస్పందించారు.

“తాను బొగ్గుల పులి ని కాదు బొబ్బిలి పులి నే” అంటూ దాసరి మరోసారి తన బలుపు చూపించారు. అంతేకాదు తనకూ ఈ స్కాం కు ఎటువంటి సంబంధం లేదని, తనను ఒక పధకం ప్రకారం ఈ స్కాం లో కొందరు ప్రముఖులు ఇరికిస్తున్నారని దాసరి వాదన. చిరంజీవి కాంగ్రెస్ రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత రాజకీయాలలో కొద్దిగా లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్న దాసరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలు ఆ మధ్య తరచూ వినిపించాయి. ఆ వార్తలు వచ్చిన నేపధ్యంలో దాసరి కి చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా కొందరు ఈ పెద్దలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా..? అనే అనుమానం కూడా లేకపోలేదు. నిన్న దాసరి పై జరిగిన దాడులతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారి ఉల్లిక్కిపడింది.

అంతేకాదు టాలీవుడ్ లోని ఎంతోమంది ప్రముఖులు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే దాసరి నారాయణరావు యే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటే టాలీవుడ్ పరిశ్రమ స్థితి ఏమి కావాలి అంటూ అఫ్ ది రికార్డు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు సంబంధించిన ప్రముఖులకు కూడా అవినీతి మరకలు అంటడం దురదృష్టకరం. భారతదేశ చరిత్రలోనే 1.86 లక్షల కోట్ల రూపాయల అతి పెద్ద స్కాం గా పేరొందిన ఈ బొగ్గుమసి మరి ఎంతమందిని బలి తిసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: