టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షనేతగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడని ఆరోపిస్తోంది అధికార వైసీపీ. అందుకు ఆ పార్టీ కొన్ని కారణాలు చూపిస్తోంది. సీఎంగా జగన్ నాలుగు నెలల పాలనలో సూపర్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటుంటే.. చంద్రబాబు నాలుగు నెలలుగా ప్రతిపక్షనేతగా ఫెయిలయ్యారంటున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు నాలుగు నెలల ప్రతిపక్ష రాజకీయాన్ని తప్పుబడుతున్నారు.


ఎందుకంటే.. ఎస్సీల బిల్లుకు మద్దతు లేదు.. ఎస్టీల బిల్లుకు మద్దతు లేదు.. బీసీల బిల్లుకు మద్దతు లేదు.. మైనార్టీల బిల్లుకు మద్దతు లేదు.. మహిళల బిల్లుకు మద్దతు లేదు.. గ్రామ సచివాలయాలకు మద్దతు లేదు.. జ్యుడీషియల్ ప్రివ్యూ బిల్లుకు మద్దతులేదు... ప్రజా ధనాన్ని మిగిల్చే రివర్స్ టెండరింగ్ కి మద్దతు లేదు అంటూ చంద్రబాబు తీరును తప్పుబడుతున్నారు.


ఇంకా.. ఆశా కార్యకర్తల జీతాలు పెంపుదలకు మద్దతు లేదు.. పోలీసులకు వారాంతపు సెలవుకు మద్దతు లేదు.. ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తుంటే మద్దతు లేదు.. స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతులేదు.. ఆసుపత్రులు బాగు చేసినా మద్దతు లేదు... జలాశయాలన్నీ నిండుకుండల్లా నిండినా... అన్ని జిల్లాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురిసినా మీకు సంతోషం లేదు.. అంటూ విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినా మీకు సంతోషం లేదు... పై అంశాలను గమనిస్తే.. మీరు ప్రతిపక్ష నాయకులా.. ప్రజా వ్యతిరేక నాయకులా చంద్రబాబు గారూ..? అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


ప్రతిపక్ష నేత అంటే.. ప్రజలకు కష్టకాలంలో అండగా ఉండాలి.. వారి ఆందోళనలకు మద్దతుగా నిలవాలి. ప్రజాపోరాటాలను నిర్మించాలి. కానీ ఈ విషయంలోనూ చంద్రబాబు అంతగా సక్సస్ కాలేదు.. గోదావరి, కృష్ణా వరదల సమయంలోనూ ఆయన పెద్దగా బయటకు రాలేదు. గోదావరి పడవ ప్రమాదం సమయంలోనూ కనిపించలేదు. ఇలాంటి సమయంలో గతంలో చురుకుగా జనంలోకి వెళ్లే చంద్రబాబు ఎందుకో ఇటీవల ఇంటికే పరిమితం అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: